Saturday, April 13, 2013

మహేష్ యాడ్: చంపేస్తామని ఫ్యాన్స్ బెదిరింపులు

mahesh babu fans threats complaint హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రచారం చేస్తున్న రాయల్ స్టాగ్ బ్రాండ్ యాడ్‌పై హెచ్.ఆర్.సి(రాష్ట్ర మానవ హక్కుల సంఘం)కు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు మద్యం ప్రకటనల్లో నటించడం వల్ల యువతను పెడదోవ పట్టే అవకాశం ఉందని కొందరు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్‌సి జూన్ 5 లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. కాగా... ఈ ఫిర్యాదు చేసిన వారిపై మహేష్ బాబు అభిమానులు బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహేష్ అభిమానులు తమని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు దారులు సతీష్, మరొక వ్యక్తి సూర్యా పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. మీడియాకు కూడా తమకు బెదిరింపులు వస్తున్న విషయాన్ని తెలియజేసి.... మహేష్ బాబు అభిమానుల నుంచి వచ్చిన కాల్ రికార్డ్స్ ను చూపించారు. పోలీసులు తమకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని, సమాజం హితం కోసం తాము ఫిర్యాదు చేస్తే.... అది తమ ప్రాణాల మీదకు వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తమకేమైనా జరిగితే అందుకు మహేష్ బాబే బాధ్యత వహించాలని సతీష్ పేర్కొన్నారు. mahesh babu fans threats complaint మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈ మధ్య సినిమాల కంటే యాడ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రచారం చేస్తున్న వాటిలో ‘రాయల్ స్టాగ్' బ్రాండ్‌ కూడా ఉంది. రాయల్ స్టాగ్ బ్రాండ్ పేరుతో పలు ఉత్పత్తులు ఉన్నప్పటికీ...... ముఖ్యమైన ఉత్పత్తి మాత్రం రాయల్ స్టాగ్ విస్కీ. మత్తు కలిగించి ఆరోగ్యానికి హానికారకమైన విస్కీకి ప్రచారం చేయడానికి పబ్లిక్ ఫిగర్లుగా ఉండే సెలబ్రిటీలు ముందుకు రారు. దీంతో అదే పేరుతో ఇతర ఉత్పత్తులు(సోడా, ఇతర ఉత్పత్తులు) తయారు చేస్తూ వాటికి ప్రచారం చేయించడానికి వారిని ఒప్పిస్తుంటారు. తద్వారా విస్కీకి పరోక్షంగా ప్రచారం కల్పిస్తారన్నమాట. ఈ మధ్య చాలా మద్యం కంపెనీలు ఇలాంటి గిమ్మిక్కులే చేస్తున్నాయి. తాజాగా మహేష్ బాబుతో కూడా అలానే చేయిస్తున్నారు. రాయల్ స్టాగ్ మెగా మ్యూజిక్ పేరుతో ఓ ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చి దానికి మహేష్ బాబుతో ప్రచారం చేయిస్తున్నారు. ఈ బ్రాండ్ కు ఇది వరకు చాలా మంది బాలీవుడ్ స్టార్లు, క్రికెటర్లు సైతం ప్రచారం చేసారు. ఇది పరోక్షంగా రాయల్ స్టాగ్ విస్కీకి ప్రచారం చేయడమే అనేది బహిరంగ రహస్యమే. కాదంటారా...?

No comments:

Post a Comment