Saturday, May 4, 2013

పవన్ సినిమాలో మహేష్ నటించడం లేదు

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అత్తారింటికి దారేది'(వర్కింగ్ టైటిల్) చిత్రంలో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. గతంలో మహేష్ బాబు జల్సా సినిమాకు వాయిర్ ఓవర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ వార్త నిజమే అని చాలా మంది నమ్మారు.
మీడియాలో ఈ విషయం చర్చనీయాంశం కావడంతో....ఈ విషయం కాస్త సినిమా యూనిట్ సభ్యుల చెవిలో పడింది. ఈ సినిమాకు పని చేస్తున్న వ్యక్తి ఒకరు దీనిపై స్పందిస్తూ...ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని, పవన్-త్రివిక్రమ్ మూవీలో మహేష్ బాబు ఎలాంటి పాత్ర చేయడం లేదని స్పష్టం చేసారు.
ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ యూరఫ్ లో ప్లాన్ చేసారు. జూన్ మొదటి వారంలో అక్కడ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మొత్తం 25 రోజుల పాటు వివిధ లోకేషన్లలో అక్కడ షూటింగ్ జరుపాలని నిర్ణయించారు. ఈ మేరకు యూరప్ లోని లొకేషన్ల గురించి ఆరా తీస్తున్నారు. రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు. ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 7వ తేదీన సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ : రవీందర్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివా

No comments:

Post a Comment