Wednesday, June 5, 2013

నా సినిమాల వల్ల ఎవరూ చెడిపోలేదు, టాలీవుడ్లోనే ఉంటా, 1 నేనొక్కడినే ఉద్దేశ్యం వేరు : మహేష్ బాబు

Mahesh Babu Inaugurates Rainbow Hospital Vijayawada
 హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బుధవారం విజయవాడలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాత్రికేయులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా విలేకరులు వేసిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధాలు ఇచ్చారు. సినిమాలు చూసి యూత్ చెడి పోతున్నారని ఓ విలేఖరి అడగా....తానుప్పుడూ అలాంటి సినిమాలు చేయనని, నా సినిమాలు చూసి ఇప్పటి వరకు ఎవరూ చెడిపోలేదని స్పష్టం చేసారు. బాలీవుడ్లో సినిమా చేస్తున్నారట కదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, వేరే ఇండస్ట్రీలోకి వెళ్లే ఆలోచన లేదని గతంలోనే చెప్పాను, ఇప్పుడూ అదే చెబుతున్నాను..మరో పదేళ్ల పాటు టాలీవుడ్లో ఉంటానని ఖశ్చితంగా చెబుతున్నాను అని స్పష్టం చేసారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని, రాజకీయాల గురించి తానెప్పుడూ ఆలోచన చేయలేదని, అంత తీరిక కూడా లేదని...మీరు ఏదో ఒకటి రాసుకోవడానికి తనను ఇలాంటి ప్రశ్నలు అడగవద్దని మహేష్ బాబు మీడియా మిత్రులను సున్నితంగా మందలించారు. ప్రస్తుతం జేమ్స్ బాండ్ క్యారెక్టర్లు చేసే ఆలోచన లేదని, అవి చేసి నాన్న సినిమాలు చెడగొట్టడం ఇష్టం లదేన్నారు. మంచి కథ దొరికతే మల్టీ స్టారర్లు మరిన్ని చేయడానికి సిద్ధమే అన్నారు. ‘1 నేనొక్కడినే’ టైటిల్ వెనక వేరే ఉద్దేశ్యం లేదని, నేనే నెం.1 అని దాని పరమార్థం కాదని, అలాంటి నెంబర్ గేమ్ తనకు ఇష్టం లేదని, పరిశ్రమలో అందరూ ప్రేక్షకులను రంజింప చేయడానికే ప్రయత్నిస్తున్నారనే అర్థం వచ్చేలా వివరణ ఇచ్చారు మహేష్ బాబు. విజయవాడ నగరం అంటే ఎంతో ఇష్టమని, అత్యున్నత సౌర్యాలతో వైద్య సేవలు అందించే రెయిన్ బో ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని, ఈ సినిమా నా కెరీర్లో మైలురాయిగా నిలుస్తుందని, ఇందులో కొత్త లుక్ తో కనిపిస్తానని మహేష్ బాబు స్ఫష్టం చేసారు

No comments:

Post a Comment